నార్మన్ బెతూనే వైద్య సేవలు


మా గురించి

డా .కోట్నిసు ప్రజావైద్యశాల గురించి :

గ్రామీణ పేద ప్రజలకు ఉచితవైద్యం అందించాలనే ప్రధానమైన ఉద్దేశంతో తూర్పుగోదావరి జిల్లా, కత్తిపూడి గ్రామంలో ది.04.04.1999 తారీఖున సి.పి.ఐ (యం .యల్ ) లిబరేషన్ కార్యాలయంలో డా .కోట్నిస్ ప్రజావైద్యశాల పేరుతో ఉచిత విద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఆదివారం ఈ వైద్యశిబిరంలో రోగులను ఉచితంగా పరీక్షించి ఉచితంగా మందులివ్వడం జరిగింది. చుట్టు ప్రక్కలవున్న అనేక మారుమూల గ్రామాలనుండి ప్రజలు వచ్చి వైద్యం చేయించుకోవడమే కాకుండా అనేక ఆరోగ్య సలహాలు పొందుతూ వచ్చారు. ఈ విధంగా కత్తిపూడిలో డా .కోట్నిసు ప్రజావైద్యశాల ది.04.04.1999 నుండి 28.08.2011 వరకు ప్రతి ఆదివారం సుమారు 12 సం.రం జరిగింది. ఆ తరువాత ప్రతి ఆదివారం ఒక్కొక్క మారుమూల గ్రామంలో, పేద ప్రజల ఇళ్ల మధ్యనే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వారికి అనేక ఆరోగ్య సూత్రాలను వివరించి చెప్పి ఆరోగ్యంపట్ల అవగాహన కల్పిస్తున్నాం. దాతల నుండి సేకరించిన బట్టలను పేద ప్రజలకు పంచిపెడుతున్నాం. పిల్లలకు బిస్కెట్లు పంచుతున్నాం. ఈ వైద్య సేవాకార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం.