నార్మన్ బెతూనే వైద్య సేవలు

భారత కమ్యూనిస్టుపార్టీ ( మార్క్సిస్టు- లెనినిస్టు) లిబరేషన్ గురించి

భారత కమ్యూనిస్టుపార్టీ ( మార్క్సిస్టు- లెనినిస్టు) సాధారణ కార్యక్రమం

    భారత కమ్యూనిస్టుపార్టీ ( మార్కిస్టు- లెనినిస్టు) భారత శ్రామికవర్గ రాజకీయపార్టీ. తన అత్యున్నత వర్గ కర్తవ్యాన్ని సాధించడానికి పోరాడుతున్న కార్మిక వర్గ సంస్థ. భూస్వామ్య బంధాలు నుండి ,భాద పెట్టుబడుదారులు ,సామ్రాజ్య వాదుల దురాశ ఆధిపత్యం నుండి విముక్తి కొరకు మరియు లింగ,కుల,మత,భాష ,జాతి వివక్షత లేకుండా పౌరులందరికీ సత్వర అభివృద్ధి,సమానహక్కులు గ్యారంటీ చేయబడే సమ సమాజంకొరకు పోరాడుతున్న భారత ప్రజలందరికీ దృఢమైన నాయకత్వాన్ని వహిస్తుంది.

    భారత దేశంలో నూతన ప్రజాస్వామ్యక విప్లవాన్ని సాధించే కనీస కార్యక్రమంతో ప్రారంభమై,సోషలిస్టు పరివర్తన, కమ్మూనిస్టు వ్యవస్థను నిర్మించే గరిష్ట కార్యక్రమానికి,ఒక మనిషిని మరో మనిషి దోచే అన్ని రకాల దోపిడీలను రద్దు చేసే అంతిమ లక్ష్యానికి పార్టీ అంకితమవుతుంది.

      మార్క్సిస్టు తాత్వికచింతన నుండి తన ప్రాపంచిక దృక్పధాన్ని పొందుతూ, ఆచరణకు మార్గదర్శకంగా మార్క్సిజం -లెనినిజం -మావో ఆలోచన అనే సమగ్ర విధానాన్ని స్వీకరిస్తుంది. భారత విప్లవ పరిపూర్తికి సరైన ఫంధాను అభివృద్ధి చేయడానికి పార్టీలోపల,బయట సంస్కరణవాదం,రివిజ నిజం,విచ్చిన్నకరవాదం,బూర్జువా ఉదారవాదం,అరాచకవాదం, తదితర పెడధోరణులకు వ్యతిరేకంగా నిర్విరామంగా పోరాడుతుంది.

      పార్టీ కార్మికవర్గ అంతర్జాతీయతను ఎత్తిపడుతూ నిరంతరం ఆచరిస్తుంది. మరియు అంతర్జాతీయ సంబంధాలలో సామ్రాజ్యవాదాన్ని,ఆధిపత్యవాదాన్ని,వలసవాదాన్ని,విస్తరణవాదాన్ని,వర్ణవివక్షతను,దురహంకారాన్ని,దురాక్రమణను,అణిచివేతను వ్యతిరేకిస్తుంది. ప్రపంచంలో వివిధప్రాంతాలలోఉన్న విప్లవ కమ్మూనిస్టు,సోషలిస్టు కార్మికులపార్టీలతోను,సంస్థలతోను ఐక్యతను నెరపుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే అణగారిన ప్రజల,జాతుల,కార్మికుల పోరాటాలకు మద్దతు తెలుపుతుంది. మొత్తం మానవజాతి విముక్తి అనే అంతిమలక్ష్యంతో సామ్రాజ్యవాదుల,అభివృద్ధి నిరోధకులకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలన్నిటితో ఉమ్మడిలాక్ష్యాన్ని ఏర్పరచుకుంటుంది. సోదర పార్టీలతో సంబంధాల విషయంలో స్వాతంత్ర్యం,ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా వుండడం,సమానత్వం,పరస్పర గౌరవం,సహకారం అనే సూత్రాలకు కట్టుబడివుంటుంది. సిద్ధాంతాన్ని ఆచరణతో మేళవించడం,ప్రజలతో సన్నిహితసంబందాలను నెరపడం,విమర్శ ఆత్మవిమర్సలను ఆచరించడం అనేది పార్టీ పనివిధానంలో మూడు మౌలికనియమాలు. తన ఆచరణను అభివృద్ధి చేసుకునే క్రమంలో వాస్తవాలనుండి సత్యాన్ని కనుగొనడం, లోతయిన పరిశోధన,అధ్యయనాన్ని పార్టీ ఎల్లప్పుడూ కొనసాగిస్తుంది.

     పార్టీ సభ్యుల ప్రజలపట్ల అత్యంత ప్రేమాభిమానాలు కలిగివుంటారు. భారత సమాజంలోని అన్ని విప్లవ సంప్రదాయాలను ఎత్తి పడతారు. తమ ప్రాణాలను పాణంగాపెట్టయినా సత్యం,కమ్యూనిజం అనే పతాకాన్ని సమున్నతంగా నిలుపుతారు.