నార్మన్ బెతూనే వైద్య సేవలు

మానవ సేవకు మించిన మరోసేవ లేదు

పేదలకు వైద్యసేవలందిచాలనే ప్రధాన ఉద్దేశంతో డా .కోట్నీస్ ప్రజావైద్యశాల ది.05.04.1999 ఆదివారం నాడు ఏర్పడింది. కత్తిపూడి గ్రామంలో సి.పి.ఐ (యం .యల్ ) లిబరేషన్ కార్యాలయంలో ది.05.04.1999 నుండి 28.08.2011 వరకు సుమారు 12 సం''లు ప్రతీ ఆదివారం ఈ శిబిరంలో ఉచిత వైద్య సేవలందించడం జరిగింది. ఈ తరువాత ఒక్కొక్క మారుమూల గ్రామంలో పేదల ఇళ్ల మధ్య వైద్య శిబిరం ఏర్పాటు చేసి, వారికి వైద్యం చేయడమే కాకుండా వారికి ఆరోగ్య సూత్రాలు వివరించి చెప్పి ఆరోగ్యంపట్ల అవగాహన కల్పిస్తున్నాం. ఈ వైద్య సేవా కార్యక్రమాలు సి.పి.ఐ (యం .యల్ ) లిబరేషన్, ఆంద్రప్రదేశ్ జన సాంస్కృతిక మండలి సంయుక్త ఆధ్వర్యంలో డా .కోట్నీస్ ప్రజావైద్యశాల పేరుతో డా.నార్మన్ బెతూన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్ ఆర్థిక సహాయంతో జరుగుతున్నవి.

మేము గ్రామాలలో చేస్తున్న ఉచిత వైద్య సేవాకార్యక్రమాలు మా వెబ్ సైట్లో చూసి, మీ అమూల్యమైన సలహాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం.

Visit US : www.normanbethunemedicalservices.com
Mail US : normanbethunemedicalservices@gmail.com

ఈ సేవ కార్యక్రమాలు మరింత పెద్ద ఎత్తున నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రజల నుండి విరాళాలు కోరుతున్నాం. డా. నార్మన్ బెతూన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్ కు ఇన్ కంటాక్స్ ఎగ్జమ్ సన్ కూడా కలదు. గౌరవనీయులైన డాక్టర్లు, మెడికల్ రిప్రెజెంటేటివ్స్ ను వారి వద్ద మిగిలిన పిజీషియన్ శాంపిల్స్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. పాట, కొత్త బట్టలు, దోమతెరలు, దోమల పొగ చట్రాలు, పెన్నులు, నోటుబుక్కులు బిళ్ళలు, గ్లూకోజ్ ప్యాకెట్లు మొదలగునవి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. మీరు ఏమి ఇవ్వాలనుకున్న సెల్ నెం.9493958887(రాజు) కు ఫోన్ చేస్తే, మా కార్యకర్తలు మీ ఇంటికి వచ్చి సేకరిస్తారు.

డా .నార్మన్ బెతూన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్, కాకినాడ
రిజిస్టర్ నెం : 34 ఆఫ్ 2016
అకౌంట్ నెం :3470645667
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,సర్పవరం జంక్షన్ బ్రాంచి, కాకినాడ.

Eligible for deduction U/S 80 G(2)(iv) vide approval No.CIT(E)/ Hyd/3(10)/12 A&80G/2015-16 , dated 30.03.2016, which shall be valid in perpetunity

విప్లవ వందనాలతో,
డా .చిన్నిబిల్లి సత్యనారాయణ, ఎం.బి.బి.ఎస్.
సూర్య హాస్పిటల్, ప్రజావైద్యశాల
సర్పవరం జంక్షన్, కాకినాడ-533005.
ఫోన్: 0884-2346677
రాష్ట్ర అధ్యక్షులు : ఆంద్రప్రదేశ్ జనసాంస్కృతిక మండలి
అధ్యక్షులు : డా .నార్మన్ బెతూన్ మెడికల్ సర్వీసు అసోసియేషన్